సీఐని సన్మానించిన టీఎన్జీవో నాయకులు

67చూసినవారు
సీఐని సన్మానించిన టీఎన్జీవో నాయకులు
పోలీస్ శాఖలో అందిస్తున్న సత్వర సేవలకు గాను రాష్ట్రస్థాయిలో మూడవ స్థానం సాధించి డీజీపీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ దేవయ్యను బుధవారం టీఎన్జీవో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి, పూల మొక్క బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి, నాయకులు తిరుపతి, అంజయ్య, వెంకటేష్, నాగుల గోపాల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్