ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
వేమనపల్లి మండలం ముల్కలపేట గ్రామానికి చెందిన ఆకుల అంకును (40) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నిల్వావాయి ఎస్సై శ్యామ్ పటేల్ తెలిపారు. మానసిక స్థితి సరిగా లేక అంకుల్ నాలుగు రోజుల నుంచి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంది. గతంలో మృతి చెందిన తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఈనెల 20న ఉరేసుకోగా ఆమె తమ్ముడు అశోక్ కాపాడాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.