స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి వేడుకలను ఎంసిపిఐయూ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని రామ టాకీస్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన భగత్ సింగ్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యువత దోపిడి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.