నటుడు మంచు మనోజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద జరిగిన ఘటనపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం బయటకు వచ్చాక.. మీడియాతో మాట్లాడుతుండగా.. తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డారు. దీంతో ప్రెస్ మీట్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.