ఏపీలో విస్తరించిన మడ అడవులు

66చూసినవారు
ఏపీలో విస్తరించిన మడ అడవులు
మడ అడవుల ఆవరణ వ్యవస్థ ఎన్నో రక్షణాత్మక, ఉత్పాదక ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది. రక్షణాత్మక విధుల కారణంగా వీటికి తీరప్రాంత సైన్యమని, మౌన హరిత కాపలాదారులనే పేరుంది. మడ అ‍డవులు తూ.గో. జిల్లాలో కాకినా‍‍‍‍‍‍డ సమీప‍ంలోని కోర‍ంగి వద్ద విస్తృతంగా విస్తరించి ఉన్నాయి. తాళ్ళరేవు మండలంలోని కోరంగి నుంచి ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల తీర గ్రామాల్లో ఇవి విస్తారంగా ఉన్నాయి. ఇక్కడే కోరింగ వన్యప్రాణి అభయారణ్యం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్