పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా, మను బాకర్ అద్భుత ప్రదర్శన చేశారు. అయితే ఒలింపిక్స్ ముగిశాక వీరిద్దరు మాట్లాడుకుంటున్న ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. దీంతో వారిద్దరికీ సంబంధం అంటగడుతూ నెటిజన్లు కామెంట్లు చేయడంపై ఆమె తండ్రి రామ్ కిషన్ బాకర్ స్పందించారు. తన భార్య ఖచ్చితంగా నీరజ్ చోప్రాతో క్రీడల గురించే మాట్లాడి ఉంటుందని.. మను చాలా చిన్నది, ఆమె పెళ్లి గురించి మేం ఇప్పుడే ఆలోచించడం లేదని రామ్ కిషన్ బాకర్ స్పష్టతనిచ్చారు.