ఇండోనేషియా అచే ప్రావిన్స్ సమీపంలోని సముద్రగర్భంలో 5.9 తీవ్రతతో భారీ
భూకంపం సంభవించింది. ఆ
భూకంపం తీవ్రత పలు ప్రాంతాల్లో కూడా తెలిసిందని అధికారులు చెప్పారు. కాగా
భూకంపం వచ్చిన వెంటనే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ఈ ప్రకంపనల కేంద్రాన్ని తినాబాంగ్ తూర్పు దిశగా 362 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు చెప్పారు.