దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 94 రైళ్ల టైమ్ టేబుల్లో ఇవాల్టి నుంచి ఈ మార్పులు ఉండనున్నట్లు వెల్లడించింది. ఇందులో తిరుపతి-కాకినాడ, తిరుపతి-ఆదిలాబాద్, లింగంపల్లి-విశాఖ, షాలిమర్-హైదరాబాద్, హైదరాబాద్-తాంబరం సహా పలు రైళ్లు ఉన్నాయి. అలాగే మరికొన్ని రైళ్లకు కొన్ని స్టేషన్లలో కొత్తగా హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.