కొత్త ఏడాది తొలిరోజే కేంద్ర మంత్రివర్గ సమావేశం జగరనుంది. పలు ప్రాజెక్టులు, కొత్త పథకాలపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోయే భేటీలో చర్చించనుంది. కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా ఇస్తున్న మొత్తం పెంపు మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.6 వేలు ఇస్తుండగా.. కేంద్రం రూ.10 వేలకు దానిని పెంచిన సంగతి తెలిసిందే. వీటితో పాటు పలు కీలక నిర్ణయాలనూ భేటీ అనంతరం ప్రకటించే అవకాశం ఉంది.