తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 14 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి క్వీన్‌లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. సీఎంతో పాటు సీఎస్, ఇతర అధికారులు ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ఇక జనవరి 16న ఆస్ట్రేలియా నుంచి నేరుగా సింగపూర్ వెళ్లి అక్కడ క్రీడా ప్రాంగణాలు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.