విశాఖలో క్రాకర్ పేలి వ్యక్తి మృతి

67చూసినవారు
విశాఖలో క్రాకర్ పేలి వ్యక్తి మృతి
AP: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో అపశృతి చోటు చేసుకుంది. క్రాకర్ పేలి ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన విశాఖ జిల్లా గాజువాక పట్టణంలోని వడ్లపూడి రజకవీధిలో జరిగింది. సుద్దమళ్ల శివ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి 12.05 గంటలకు కేక్ కట్ చేసే క్రమంలో క్రాకర్ వెలిగించారు. ఆ క్రాకర్ పేలడంతో శివ నుదిటిపై పెద్ద గాయమైంది. తీవ్ర రక్తస్రావమై శివ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్