AP: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. పేర్ని నాని నివాసంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఇవాళ పేర్ని జయసుధ బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌కు రావాలని పేర్కొన్నారు. అయితే ఆమె విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.