AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి స్పందించారు. 'సీఎం చంద్రబాబుది దురదృష్టమైన పాదం. చంద్రబాబు అధికారంలో వచ్చిన ప్రతీసారి అమాయక ప్రజలు చనిపోతున్నారు. పుష్కారాల దగ్గర నుంచి నిన్న తిరుపతి ఘటన వరకు అదే జరుగుతోంది. తిరుపతిలో ఇలాంటి ఘటన ఇప్పటి వరకు జరగలేదు. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది' అని ఆమె వీడియో విడుదల చేశారు.