భారీగా విరిగిపడ్డ కొండచరియలు

67చూసినవారు
భారీగా విరిగిపడ్డ కొండచరియలు
అరుణాచల్ ప్రదేశ్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జాతీయ రహదారి-33పై హున్లీ-అనిని మధ్య భారీగా కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. దీంతో చైనా సరిహద్దు జిల్లా దిబాంగ్ వ్యాలీలో రహదారి పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు చెప్పారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు హైవేపై దెబ్బతిన్న ప్రాంతాలకు మరమ్మతులు చేపడుతున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్