ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో పట్టపగలు షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి ఓ నగల దుకాణంలో ఐదుగురు దుండగులు షాపులోకి ప్రవేశించి.. తుపాకులతో బెదిరించి 2 బ్యాగుల్లో ఉన్న బంగారం మొత్తం దోచుకెళ్లారు. ఈ ఘటన మొత్తం అక్కడి ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆభరణాల విలువ కొన్ని కోట్లు ఉంటుందని షాపు యజమాని పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.