కౌన్సిలర్ పై దాడి

7103చూసినవారు
కౌన్సిలర్ పై దాడి
అనుమతి లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన సిద్దిపేట జిల్లా దుబ్బాక 3వ వార్డు కౌన్సిలర్ పై దాడి జరిగింది. ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చెల్లాపూర్ 3వ వార్డు కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి మహిళా మండలి భవనం వద్ద ఉండగా అదే గ్రామానికి చెందిన బాసిరెడ్డి బాపురెడ్డి, భార్య దేవమ్మ, కుమారడు సాయిరెడ్డి వచ్చి తనపై పిడిగుద్దులు, కర్రలతో దాడి చేశారని కౌన్సిలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మాణాలకు అడ్డు పడితే చంపేస్తామని హెచ్చరించారని ఆయన అన్నారు. కాగా తన భార్యను తనను కౌన్సిలర్ అంతకు ముందు దుర్భాషలాడారని ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాపురెడ్డి తెలిపారు. కాగా కౌన్సిలర్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి దాడిని ఖండించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you