మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో అక్రమ గ్యాస్ రిఫిలింగ్ పై జిల్లా సివిల్ సప్లై అధికారి పనితరెడ్డి విచారణ చేపట్టారు. వెల్దుర్తి నుండి గ్రామాలకు సరఫరా చేస్తున్న ఇండియన్ గ్యాస్ సిలిండర్ల నుండి అక్రమంగా రిఫ్లింగ్ చేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో గ్రామంలో పర్యటించిన పనితరెడ్డి విచారణ చేపట్టారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన సమాచారంతో పూర్తిస్థాయి విచారణ ఉన్నతాధికారులకు సమర్పిస్తామని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.