మెదక్ కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొండా సూరేఖ గురువారం హాజరయ్యారు. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలను మంత్రితో కలిసి నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.