రక్త దాన శిబిరానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎస్పీ

369చూసినవారు
రక్త దాన శిబిరానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎస్పీ
తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో పోలీస్, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్త దాన శిబిరానికి జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు రాక్ గార్డెన్ లో డీఎస్పీ కిరణ్ కుమార్ తో కలిసి మొక్కను నాటారు. అక్కడే అంగన్వాడి కేంద్రంలో ఉన్న చిన్నారులను పలకరించి వారికి పండ్లను అందజేశారు. అలాగే గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, డి. ఎస్. పి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రక్త దానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారికి ప్రాణం పోసినట్టు అవుతుందని అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం అలవర్చుకోవాలి అన్నారు. అన్నింటిలో ఆదర్శంగా ఉన్న మల్కాపూర్ ప్రమాదాల రహిత గ్రామంగా రికార్డు నెలకొల్పాలి అన్నారు. హెల్మెట్ ధరించి మాత్రమే వాహనాలు నడుపుతామని ఎస్పీ సమక్షంలో గ్రామస్తులంతా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి ఎస్పి చేతుల మీదుగా ధ్రువ పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో తూప్రాన్ సీఐ శ్రీధర్, సర్పంచ్ మహా దేవి నవీన్, ఎంపిటిసి పంజాల వెంకటమ్మ, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఎస్సైలు సురేష్ కుమార్, యాదిరెడ్డి, రాజు గౌడ్, మధుసూదన్ గౌడ్, రవికాంత్ రావు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేకిన్ యువత, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్