ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ గురించి గత కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో చర్చ సాగుతోంది. వాస్తవానికి ఎన్నికల సమయంలో వాలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రూ.10000 వేతనం కూడా ఇస్తామన్నారు. అయితే వాలంటీర్లు తమను కొనసాగించకుంటే ధర్నాలు చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు. మరోవైపు తాము చెప్పిన వారికే వాలంటీర్ల ఉద్యోగాలు ఇవ్వాలని కూటమి పార్టీలోని నేతలు పట్టుబడుతున్నారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థ కూటమికి పెద్ద గండంలా మారినట్లు తెలుస్తోంది.