మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం హాజరయ్యారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ తో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రంధాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.