రామంతపూర్ తండా విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు

266చూసినవారు
రామంతపూర్ తండా విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు
జియంఅర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపిపిఎస్ రామంతపూర్ తండా పాఠశాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ వేసవిలో విద్యార్థులలో సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించేలా వేసవి శిక్షణ తరగతులు సోమవారం నిర్వహించారు. ఈ శిబిరంలో కథలు, పద్యాలు, చిత్రలేఖనం, ఆర్థమెటిక్, రీజనింగ్, హిందీ, స్పోకెన్ ఇంగ్లీష్, చేతిరాత, వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఫౌండేషన్ ఇంచార్జ్ శ్రీనివాస్ తెలిపారు. జియంఅర్ పోచంపల్లి ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరమణ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థుల శిక్షణకు అవసరమైన పుస్తకాలు, స్టేషనరీ అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లడుతూ చిన్ననాటి నుంచి పఠనాసక్తి పెంపొందించు కోవాలని, వేసవిలో సమయాన్ని వృథా చేయకుండా శిబిరంలో నేర్పించే అంశాలన్నీ శ్రద్ధగా నేర్చుకోవాలని అన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న ఫౌండేషన్ వాలంటీర్ శాంతిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరమణ, ప్రవీణ్ కుమార్, సతీష్ కుమార్ పట్నాయక్, ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్, వాలంటీర్స్ శాంతి, పొచలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్