తూప్రాన్: షెడ్డులో అగ్నిప్రమాదం.. 8 కార్లు దగ్ధం
మెదక్ జిల్లా తూప్రాన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు షెడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 8 కార్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా షార్ట్ సర్క్యూట్ తోనే అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.