జహీరాబాద్: 14న తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి
బాలల దినోత్సవం సందర్భంగా ఈనెల 14వ తేదీన అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ప్రగతి పాఠశాలల అభివృద్ధిపై తల్లిదండ్రులకు వివరించాలని పేర్కొన్నారు. సమావేశం నివేదికలను డీవో కార్యాలయానికి పంపించాలని సూచించారు