ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది . మొదటి అంతస్తులోని ఇంటి బాల్కనీలో ఆడుకుంటున్న 3 ఏళ్ల చిన్నారి సోమవారం అకస్మాత్తుగా కిందపడిపోయింది. స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.