
కోహీర్: విద్యార్థులు మంచి మార్పులు సాధించేందుకు కృషి చేయాలి
పదవ తరగతి విద్యార్థులు ప్రణాళికతో చదివి మంచి మార్కులు సాధించాలని ఎంఈఓ జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహీర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు హాల్ టికెట్లను సోమవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ సమయం చక్కగా ఉన్నందున కష్టపడి చదవాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి 10 జీపీఏ సాధించేందుకు కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు