మహారాష్ట్రలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న 404 సోలార్ విద్యుత్ ప్లాంట్లతో 1,880 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ విద్యుత్‌ను రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఉన్న రైతులకు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం వినియోగించుకోనున్నారు.