భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేలా అవసరమైన పొడవు, ఒకటిన్నర అడుగుల ఎత్తులో వర్మి కంపోస్ట్ బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. బెడ్ల అడుగు భాగం గుళ్లగా లేకుండా గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసే బెడ్లలో వాటిని బండలతో గాని, సిమెంటుతో గాని గట్టి పరచవచ్చు. బెడ్లపై 45 సెం.మీ ఎత్తు వరకు కొద్దిగా కుళ్లిన, కుళ్లు స్వభావం గల వ్యర్థ పదార్ధాలను సెం.మీ మందం వరకు పేడ నీటితో కలిపి చల్లాలి. వారం తర్వాత వానపాములను వదలాలి.