తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేసే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ పథకం అమలు విషయమై ఇంటర్ విద్యా కమిషనరేట్ ప్రతిపాదనలను సిద్ధంచేసి ఈ నెలలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. సర్కారు కాలేజీలను బలోపేతం చేయడం, డ్రా పౌట్స్‌ను నివారించేందుకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి కోరనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.