TG: అధికారంలో ఉన్న సమయంలో స్నేహపూర్వకంగా రెండు పార్టీల మధ్య.. పొలిటికల్ బ్రేకప్ తప్పదా..? అంటే అవుననే తెలుస్తోంది తెలంగాణలో తాజా పరిస్థితులు. బీఆర్ఎస్‌ను టార్గెట్‌గా చేసుకుని ఎంఐఎం అధినేత మాటల యుద్దం వెనుక ఉన్న కారణాలేంటో అంతుచిక్కడంలేదు. గత ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి సైలెంట్‌గా ఉన్న ఎంఐఎం.. ఇప్పుడు బీఆర్ఎస్‌పై సీరియస్ అవుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.