TG: రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో జరిగిన దాడి ఘటనలో గాయపడిన అధికారిని పరామర్శించారు. KADA (కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డిని ఎల్బీనగర్- బైరాముల్ గూడలోని లక్ష్మీ నరసింహ కాలనీలోని వారి నివాసం హర్ష నిలయంలో పరామర్శించారు. దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.