అసోంలో బుధవారం ఉదయం స్వల్ప
భూకంపం సంభవించింది. డర్రాంగ్ పట్టణంలో ఉదయం 7.54 గంటలకు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైంది. అయితే ఈ
భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టం గానీ జరగలేదని అధికారులు తెలిపారు.