ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం!

53చూసినవారు
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం!
అక్టోబర్ 14-24 మధ్య ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యం కనువిందు చేస్తోంది. సీ/2023 ఏ3 అనే తోకచుక్క సెప్టెంబరు 28, 2024న సూర్యుడికి దగ్గరగా చేరింది. ఆ రోజు నుంచి సూర్యుడికి దూరంగా కదలడం ప్రారంభించింది. అందుకే ప్రస్తుతం భూమి నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోని ఔత్సాహికులు దీనిని సాధారణ కళ్లతో వీక్షించవచ్చు. ఈ తోకచుక్క అరుదైన ఖగోళ ఘట్టమని, మరో 80,000 సంవత్సరాల వరకు ఇది కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్