వరి విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

318చూసినవారు
వరి విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని తానిమడుగు గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే దివాకర్ రావు వరి విత్తనాలు పంపిణీ చేసారు. హైదరాబాద్ లోని భారత వరి పరిశోధనా సంస్థ సహకారంతో, కృషి విజ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో గిరిజన ఉప ప్రణాళిక కింద గిరిజనులకు వరి విత్తనాలు, వేప ఎరువు బస్తాలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంట దిగుబడి ఎక్కువగా వచ్చే విత్తనాలు కాబట్టి, గిరిజనుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గిరిజనులకు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్