కేరళలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. వయనాడ్ లో ఇటీవల కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో మోదీ రేపు ఉదయం 11 గంటలకు వయనాడ్ లోని కన్నూరుకు వెళ్లనున్నారు. కొండ చరియలు విరిగిపడి తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అక్కడ జరిగే సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.