మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. మోహన్‌బాబు తిరుపతిలో ఉన్నట్లు ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. మనవడిని కలిసేందుకు మోహన్‌బాబు దుబాయ్ వెళ్లి తిరిగి వచ్చారని చెప్పారు. 'దుబాయ్ నుంచి వచ్చి ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు. తిరుపతిలో విద్యాసంస్థల బాధ్యత చూస్తున్నారు' అని హైకోర్టులో మోహన్‌బాబు లాయర్ పేర్కొన్నారు.