షెడ్యూల్డ్ కులాలను రెండు గ్రూపులుగా విభజించి దళితులకు సబ్- కోటాలను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా హరియాణా
వార్తల్లో నిలిచింది. ఎస్సీలను అణగారిన షెడ్యూల్డ్ కులాలు (డీఎస్సీ - డిప్రైవ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్) ఇతర షెడ్యూల్డ్ కులాలు (ఓఎస్సీ- అదర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్)గా విభజించి ప్రతి గ్రూప్‌నకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీలకు ఉన్న 20 శాతం కోటాలో 50 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.