లాయర్‌ బైక్‌నే ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి

84చూసినవారు
లాయర్‌ బైక్‌నే ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి
ఓ కేటుగాడు అన్నం పెట్టిన చేతికే సున్నం పెట్టాలని చూశాడు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరుకు చెందిన ఓ దొంగ చోరీలు చేస్తూ జీవించేవాడు. అయితే తాను అరెస్ట్ అయినప్పుడల్లా బయటికి తీసుకురావడానికి ఓ లాయర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ కేసు విషయమై వచ్చి లాయరుతో మాట్లాడి ఇంటికెళ్తూ లాయర్ బైక్‌నే కొట్టేశాడు. లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దొంగను అరెస్ట్ చేశారు. చివరికి తన క్లైంటే దొంగ అని తేలడంతో లాయర్ షాక్ అయ్యాడు.

సంబంధిత పోస్ట్