తెలంగాణ రాజకీయ అంశాలపై TPCC చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కాంగ్రెస్ లోకి మరిన్ని చేరికలు ఉంటాయయన్నారు. అది కూడా KTRతో తిరుగుతున్న ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యేల చేరికల అంశం వివాదాస్పదం అవుతుండగా, స్పీకర్ తన అధికారాన్ని ఉపయోగించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులను చూసి ఎమ్మెల్యేలు తమవైపు వస్తున్నారని తెలిపారు.