ఇండియాలో మొత్తం 53 టైగర్ రిజర్వులు ఉన్నాయి. ఇక్కడ పులుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2018-19లో 20 రాష్ట్రాల్లో పులుల సంఖ్యను లెక్కించారు. ఆ లెక్క ప్రకారం ఇండియాలో 2,967 పులులు ఉన్నాయి. 2006తో పోల్చితే ఏటా పులుల సంఖ్య 6 శాతం పెరుగుతోంది. దేశంలో 2023లో పులుల సంఖ్య 3,682కు చేరింది.