AP: రాష్ట్రంలో చైనా తరహా విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ ప్లాంట్లు చెత్త ఆధారంగా పని చేస్తాయని చెప్పారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'మూడేళ్లలో రాజధాని అమరావతి పనులు పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం నిధులను దారి మళ్లించింది. విపరీతంగా పన్నులు పెంచి ప్రజలను దోపిడీ చేసింది. తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం' అని ఆయన తెలిపారు.