పెండింగులోనే 2.43 లక్షలకు పైగా కేసులు

53చూసినవారు
పెండింగులోనే 2.43 లక్షలకు పైగా కేసులు
లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించేందుకు పోక్సో చట్టం తెచ్చారు. ఇండియా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ విడుదల చేసిన పరిశోధన పత్రం ప్రకారం.. దేశవ్యాప్తంగా 2022 నాటికి 2.43 లక్షలకు పైగా ఫోక్సో కేసులు పెండింగులో ఉన్నాయి. కొత్త కేసులేమీ అదనంగా చేరకుండా ఉంటే.. ఈ పెండింగు కేసుల పరిష్కారానికే మరో తొమ్మిదేళ్లు పట్టే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు తీర్పుతో 2019లో ఎఫ్‌టీఎస్‌సీ ఏర్పడ్డాయి. ఏడాదికి 165 వరకు కేసుల్లో తీర్పు ఇవ్వాలి. కానీ ఏడాదికి కేవలం 28 కేసులు మాత్రమే పరిష్కారమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్