గణపతి బప్పా మోరియాలో 'మోరియా' అంటే "కదిలొచ్చి మమ్మల్ని కరుణించు” అని అర్థం

52చూసినవారు
గణపతి బప్పా మోరియాలో 'మోరియా' అంటే "కదిలొచ్చి మమ్మల్ని కరుణించు” అని అర్థం
హిందువులు ఎంతో ఉత్సాహంతో జరుపుకునే పండుగ వినాయక చవితి. ఈ పండుగ రోజు 'గణపతి బప్పా మోరియా' నినాదం వినిపిస్తుంది. దీనిలో బప్పా అంటే తండ్రి అని అర్థం. ఇక 'మోరియా'కు రెండు అర్థాలున్నాయి. “మ్హోర్, యా” అంటే మరాఠీలో “ముందుకు, రా” అని అర్థం. "కదిలొచ్చి మమ్మల్ని కరుణించు” అనే అర్థంలో వాడతారు. అలాగే అడ్డంకుల్ని తొలగించేవాడని మరో అర్థం ఉంది. పరమ భక్తుడైన 'మోరియా గోసవి'కి వినాయకుడి వరం కారణంగా, 'గణపతితో మోరియా పేరును కలిపి పలుకుతారనే కథ ప్రచారంలో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్