రాజస్థాన్ రాష్ట్రంలో పింక్ సిటీగా గుర్తింపు పొందిన జైపూర్ నగరంలో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏ మాత్రం కనికరం లేని ఓ కసాయి తల్లి తన ప్రియుడితో కన్న కూతురిపై అత్యాచారం చేయించింది. కొంత కాలంగా తన తల్లి బలవంతంగా మద్యం తాగించి ఆమె ప్రియుడితో కలిసి అత్యాచారం చేయిస్తుందని సదరు యువతి ఆరోపించింది. అతను ఇంటికి వచ్చినప్పుడల్లా ఇలానే చేయిస్తుందని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.