పంజాబ్లో జరిగిన ఇంటర్–యూనివర్సిటీ కబడ్డీ ఛాంపియన్షిప్లో ఘర్షణ చోటు చేసుకుంది. తమిళనాడు మదర్ థెరిసా, బిహార్ దర్భంగా వర్సిటీ టీంల మధ్య జరిగిన మ్యాచ్లో రెఫరీ నిర్ణయంపై MT టీం ప్లేయర్ వాదనకు దిగారు. దీంతో రెఫరీ క్రీడాకారిణిపై చేయి చేసుకోగా, ఆపై ఇరు జట్ల సభ్యులు దారుణంగా కొట్టుకున్న వీడియో వైరలవుతోంది. TN ప్లేయర్లు సురక్షితంగా ఉన్నారని, త్వరలోనే రాష్ట్రానికి వస్తారని డిప్యూటీ సీఎం ఉదయనిధి తెలిపారు.