బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన స్కై ఫోర్స్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో వీర్ పహారియా కథానాయికగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న అక్షయ్ 'మనం అంతా ఒకే కుటుంబమే అయినప్పటికీ ఎక్కడో ఒకింత ఐక్యత లోపించిందని నా ఉద్దేశ్యం. అవకాశం వస్తే ఇండస్ట్రీ మొత్తాన్ని మరింత ఐక్యం చేస్తా' అని అన్నారు.