Oct 18, 2024, 14:10 IST/మక్తల్
మక్తల్
అటవీశాఖ అధికారులకు జింక అప్పగింత
Oct 18, 2024, 14:10 IST
నర్వ మండలంలోని జక్కన పల్లి శివారు ప్రాంతం వ్యవసాయ పొలంలోకి వచ్చిన జింకపై శుక్రవారం ఉదయం కుక్కలు దాడి చేశాయి. ఆ కుక్కల నుండి జింకను గ్రామస్తులు రక్షించి స్థానిక ఎస్సై కురుమయ్యకు తన కార్యాలయంలో అప్పగించారు. కుక్కల బెడద నుండి జింకను కాపాడిన గ్రామస్తులను ఎస్ఐ ప్రత్యేకంగా అభినందించారు.