దన్వాడ మండలం గన్ముక్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో శనివారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సీఎం కప్ వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు. వాలీబాల్ క్రీడల్లో మండల, జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించాలని, జిల్లాకు పేరు తేవాలని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.