అల్లు అర్జున్‌పై జనసేన నేత సంచలన ఆరోపణలు

61చూసినవారు
అల్లు అర్జున్‌పై జనసేన నేత సంచలన ఆరోపణలు
పుష్ప-2 ప్రీమియర్ వేళ హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ఇస్తానని, కుటుంబానికి అండగా ఉంటానని అల్లు అర్జున్ చెప్పారు. అల్లు అర్జున్ వ్యాఖ్యలపై తాజాగా జనసేన నేత శాంతి ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. ‘సినిమా చూడటానికి వచ్చి బలైన కుటుంబానికి రూ.25 లక్షలు మాత్రమే ఇస్తారా? కేసు మాఫీ కోసం ముష్టా? అసలు మానవత్వమే లేదు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్