కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. విజయపుర జిల్లా బెలగావి క్రాస్ సమీపంలో శుక్రవారం చెరకు కోసే యంత్రాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.